Crime news | కర్నూలు జిల్లాలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్..భారీగా నగదు స్వాధీనం
Crime news | ఏపీలోని కర్నూలు మండలం పసుపుల గ్రామపంచాయతీ పరిధిలో నకిలీ నోట్ల ముఠాను కర్నూల్ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ నోట్ల ముఠాలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందినవారు ఉండడంతో గ్రామంలో కలకలం రేగింది.
అలంపూర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు మండలం పసుపుల గ్రామపంచాయతీ పరిధిలో నకిలీ నోట్ల ముఠాను కర్నూల్ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ నోట్ల ముఠాలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందినవారు ఉండడంతో గ్రామంలో కలకలం రేగింది. కర్నూల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ శివారులో రెండు ముఠాలు నకిలీ నోట్లు మార్పిడి చేసుకుంటుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఒక ముఠా రూ.90 లక్షలు ఇస్తే, రెండో మూఠా రూ.30 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
మొదటి ముఠా నుంచి రూ.87.50 లక్షలు, రెండో ముఠా నుంచి రూ. 16.30లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రెండో గ్రూప్‌లో గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందిన జనంపల్లి చంద్రశేఖర్ రెడ్డి, భీమ్ పోగు చిన్న నాగన్న, చాకలి బ్రహ్మ ఉన్నారు. ఈ దొంగ నోట్ల మార్పిడిలో క్యాతూర్ గ్రామానికి చెందిన వారు అరెస్ట్ కావడం.. ముగ్గురిలో ఒక వ్యక్తి గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇంకా ముఠాతో ఎంతమందికి సంబంధం ఉందోనని చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

