మియాపూర్( హైదరాబాద్) : నగరంలోని మియాపూర్‌లో సోమవారం విద్యుత్ షాక్ (Electric Shock )తో కంప్రెషర్ ఆపరేటర్ ( Compressor operator ) మృతి చెందాడు. ప్రశాంత్ నగర్లో నూతన బిల్డింగ్ నిర్మాణం చేపట్టేందుకు సెల్లర్లో బండ తవ్వడానికి కంప్రెషర్ ట్రాక్టర్‌తో తో వచ్చిన సూర్యాపేట జిల్లా నాగరం చెందిన ఓర్సు శ్రీను(39) పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు.
తోటి కార్మికులు అతడిని మదినగూడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భవనం యజమాని న్యాయం చేయాలని కోరుతూ హాస్పిటల్ వద్ద మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు.