Miyapur : నగరంలోని హఫీజ్ పేటలో దారుణం జరిగింది. సెంట్రింగ్ కర్రల వ్యాపారం చేసుకునే శ్రీనివాస్ (36) దారుణ హత్యకు గురయ్యాడు. పక్క దుకాణంలోని సోహైల్ అతడి మామ అతడిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. శ్రీనివాస్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనివాస్ హత్యతో హఫీజ్‌పేట్ వాసులు ఉలిక్కి పడ్డారు. సోహైల్‌కు, శ్రీనివాస్‌కు పాతకక్షలు ఏమైనా ఉన్నాయా? స్థలం విషయంలో ఏమైనా తగాదాలు ఉన్నాయా? అనే కోణంలో కేసును విచారించనున్నారు పోలీసులు. హత్యకు దారి తీసిన కారణాలు విచారణలో తెలిసే అవకాశముంది.