బెంగళూర్ : క్యాబ్ బుకింగ్‌ను క్యాన్సిల్ చేసిన యువతి(19)ని వేధించిన క్యాబ్ డ్రైవర్‌ను బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని హెన్నూర్కు చెందిన ఎస్ పూర్విక్ (22)గా గుర్తించారు. నవంబర్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యలహంక నుంచి క్యాబ్‌ను బాధితురాలు బుక్ చేయగా ఒంటరిగా ప్రయాణిస్తుందని తెలుసుకున్న నిందితుడు అసభ్యకరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
ఈలోగా లొకేషన్‌కు చేరుకుంటున్న క్రమంలో ఆమె క్యాబ్‌ను క్యాన్సిల్ చేసింది. క్యాబ్ క్యాన్సిల్ చేయడంతో యువతి తిరుగుముఖం పట్టిన తర్వాత కూడా నిందితుడు ఆమెను ఫోన్లో అసభ్య పదజాలంతో దూషించాడు. యువతి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.