నోయిడా : విపరీతమైన ఒత్తిడితో విద్యార్ధులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా గ్రేటర్ నోయిడాలో ఓ బీటెక్ విద్యార్ధి ఫ్లాట్‌లో (BTech Student Death) సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఘటనా ప్రాంతంలో సూసైడ్ నోట్ లభించకపోవడంతో హత్య సహా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని ఆదత్య త్రిపాఠిగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం త్రిపాఠి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గ్రేటర్ నోయిడాలోని నింబస్ సొసైటీలోని ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. ఘటనా ప్రాంతంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఆత్మహత్య, హత్య కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా, రాజస్థాన్‌లోని కోటాలో (Kota) విద్యార్థుల మరణాలు ఆగడంలేదు.
ఆత్మహత్యలను (Suicide) నిరోధించడానికి అధికారులు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరుసగా బలవన్మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న (Neet Aspirant) ఓ అభ్యర్థి వక్ఫ్ నగర్ ప్రాంతంలోని తానుంటున్న గదిలో సూసైడ్ చేసుకున్నాడు. అతడిని పశ్చిమబెంగాల్‌కు చెందిన 20 ఏండ్ల ఫరీద్ హుస్సేన్‌గా (Faureed Hussain) గుర్తించారు.
Read More :
Alia Bhatt | డబ్బు కోసం నటించాలంటే భయం వేస్తుంది.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్