Alia Bhatt | డబ్బు కోసం నటించాలంటే భయం వేస్తుంది.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్
Alia Bhatt | ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుల వేడుకలో తళుక్కున మెరిసింది బాలీవుడ్ బ్యూటీ అలియాభట్. ఈ వేడుకలో ఉత్తమనటిగా అవార్డును అందుకున్నారామె. ఈ సందర్భంగా అభిమానులకు వేదిక సాక్షిగా అభివాదం చేసింది అలియా. తదనంతరం అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ‘నేను బాగా నటిస్తానని ఒకప్పుడు అందరూ మెచ్చుకున్నారు.
Alia Bhatt | ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుల వేడుకలో తళుక్కున మెరిసింది బాలీవుడ్ బ్యూటీ అలియాభట్. ఈ వేడుకలో ఉత్తమనటిగా అవార్డును అందుకున్నారామె. ఈ సందర్భంగా అభిమానులకు వేదిక సాక్షిగా అభివాదం చేసింది అలియా. తదనంతరం అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ‘
నేను బాగా నటిస్తానని ఒకప్పుడు అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడేమో గొప్ప నటిని, మహానటిని అంటున్నారు. ఇలాంటి అభినందనలు, బిరుదులూ, సత్కారాలు, పురస్కారాలు నా బాధ్యతను మరింత పెంచుతున్నాయి. నేను కమర్షియల్ హీరోయిన్ని. ప్రతిసారీ గొప్ప పాత్రలు రావు. ఇప్పుడు డబ్బుకోసం నటించాలంటే భయం వేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది అలియా. అతి చిన్నవయసులో జాతీయ ఉత్తమనటి అవార్డు అందుకుని రికార్డు సృష్టించడం పట్ల ఆమె మాట్లాడుతూ ‘ఆ అవార్డు అందుకున్న వారందరిలో నేనే చిన్నదాన్నని ఆలస్యంగా తెలిసింది. ఈ విషయం తెలిశాక రణ్బీర్ నాకు చాలా విలువైన బహుమతి ఇచ్చాడు. ఏమిచ్చాడో అడగొద్దు.. అది సీక్రెట్’ అంటూ అందంగా నవ్వేసింది అలియా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

