కుత్బుల్లాపూర్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం మహిళా దారుణ హత్య( Murder ) కు గురైంది .కౌడిపల్లి కి చెందిన స్వాతి ( Swati ) అనే మహిళను రాజేష్( Rajesh) అనే వ్యక్తి గొంతుకోసి చంపివేశాడు. అనంతరం పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. గత కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటున్న స్వాతి రాజేష్‌తో సన్నిహితంగా ఉంటుంది.
ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, ఉదయం కత్తితో గొంతు కోసి దుండిగల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.