రాంచి: తమతో స్నేహం చేయాలని, లేకపోతే బలవంతంగా ఎత్తుకెళ్లి కిడ్నాప్ చేస్తామని స్కూల్ బాలికలను ముస్లిం యువకులు బెదిరించారు. వారు ఏకంగా తుపాకులతో అక్కడకు వెళ్లారు. జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 5న ఒర్మాంఝీలోని సద్మా ప్రాంతంలో ప్రాజెక్ట్ ప్లస్ టూ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. కొందరు ముస్లిం బాలురు తుపాకులతో ఆ స్కూల్‌కు వెళ్లారు. అడ్డుకోబోయిన క్లర్క్‌ను బెదిరించారు. అనంతరం క్లాస్‌లోకి వెళ్లి తమతో స్నేహం చేయాలని, లేకపోతే కిడ్నాప్ చేస్తామంటూ గిరిజన, హిందూ బాలికలను బెదిరించారు.
కాగా, ఈ సంఘటన ఆ ప్రాంతంలోని రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో వివాదం పరిష్కారం కోసం రెండు వర్గాల వారితో కలిసి ఆ స్కూల్లో శనివారం సమావేశం నిర్వహించారు. అయితే ఆ రెండు వర్గాల వారు ఘర్షణకు దిగడంతో ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. శాంతి భద్రతలు అదుపుతప్పకుండా చర్యలు చేపట్టారు. స్కూల్ సిబ్బంది, విద్యార్థులను బెదిరించడంతోపాటు వర్గాల మధ్య అల్లర్లకు కారణమైన ఐదుగురు ముస్లిం యువకులపై కేసు నమోదు చేశారు. సోమవారం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ సంఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది.