తిరువనంతపురం : కేరళలోని కొండొట్టి పట్టణ శివార్లలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి తాను పనిచేసే కంప్యూటర్ కేంద్రానికి నడిచివెళుతున్న యువతి (23) వెంటపడిన బాలుడు(15) ఆమెను వెంబడించి సమీపంలో ఉన్న పొలంలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి ప్రయత్నంచాడు.యువతి లైంగిక దాడిని ప్రతిఘటించడంతో ఆమె చేతులను కట్టేసి రాయితో దాడి చేశాడు.
బాలుడి నుంచి తప్పించుకున్న యువతి సమీపంలోని ఓ ఇంటికి చేరుకుని స్ధానికులకు విషయం తెలిపింది. బాధితురాలు తెలిపిన వివరాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పదవ తరగతి చదువుతున్న రాష్ట్రస్ధాయి జ్యూడో ఛాంపియన్గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. లైంగిక దాడి యత్నంపై తొలుత బుకాయించిన నిందితుడు ఆ తర్వాత నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.