భోపాల్: సెల్ఫీ కోసం రైలు ఇంజిన్ పైకెక్కిన యువకుడు కరెంట్ షాక్‌తో మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. 16 ఏళ్ల సుహైల్ మన్సూరీ గురువారం స్థానిక రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ నిలిచి ఉన్న కరెంట్ రైలు ఇంజిన్ పైకి వెక్కాడు. తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. పైనున్న హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను పట్టుకోబోగా విద్యుదాఘాతానికి గురై మరణించాడు.
కాగా, ఈ ఘటనపై మన్పూరీ స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ మాస్టార్ కార్యాలయం డోర్‌ను రాళ్లతో ధ్వంసం చేశారు. స్టేషన్ మాస్టర్‌పై కూడా దాడి చేయడంతోపాటు ఆయన బ్యాగ్, వాచీని లాక్కున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) వెంటనే స్పందించి పరిస్థితిని అదుపు చేశారు.
పోస్ట్‌మార్టం కోసం యువకుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ తెలిపారు. యువకుడి మృతి ఘటనతోపాటు రైల్వే స్టేషన్ మాస్టర్ కార్యాలయంపై దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.