లక్నో : యూపీలో దారుణం జరిగింది. ఘజియాబాద్‌లోని విజయ్‌నగర్ ప్రాంతంలో ఐదేండ్ల బాలికపై బాలుడు (13) లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. బాలిక తన సోదరుడితో కలిసి మంగళవారం ట్యూషన్‌కు వెళ్లగా ఆ సమయంలో టీచర్ లేకపోవడంతో ఆమె కుమారుడు బాలికపై దారుణానికి పాల్పడ్డాడు.
ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయం కుటుంబసభ్యులకు తెలిపింది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని నోయిడాలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.