హైదరాబాద్ : నగరంలోని విజయనగర్ కాలనీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎం ( ATM ) లో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ( Dead Body ) లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు మెహదీపట్నం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఏటీఎం తలుపు తెరిచి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ వ్యక్తి ఏటీఎంలోకి వెళ్లిన తర్వాత తలుపు లాక్ అవడంతో లోపలే ఊపిరాడక మృతి చెందినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.