న్యూఢిల్లీ : రాంగ్ రూట్లో ఎందుకు తీసుకువెళుతున్నావని ప్రశ్నించిన యువతిని ఆటో డ్రైవర్ లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన యూపీలోని నోయిడాలో వెలుగుచూసింది. ఢిల్లీలోని ఆశ్రమ్‌లో ఉండే మహిళ తన సోదరుడికి ఆరోగ్యం బాలేదని ఆయనను చూసేందుకు తన నాలుగేండ్ల కూతురితో కలిసి సూరజ్‌పూర్‌కు ఆటోలో బయలుదేరింది. గ్రేటర్ నోయిడాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్ద ఆటో డ్రైవర్ రాంగ్‌రూట్ తీసుకున్నాడు.
ఆటోడ్రైవర్ తీరుపై ఆమె అభ్యంతరం తెలపడంతో ఆగ్రహించిన నిందితుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆటోడ్రైవర్ ఆగడాలకు భయపడిన మహిళ పాపతో కలిసి ఆటో నుంచి దిగిపోయింది. ఆపై వెంటనే భర్తకు, పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించింది.
అయితే మహిళ ఫిర్యాదు చేస్తుండగా అప్పటికే ఆటోడ్రైవర్ పరారయ్యాడు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే తనను వేధింపులకు గురిచేశాడని, మరికొందరు ప్రయాణీకులను ఎక్కించుకున్నా వారిని మధ్యలోనే దించేశాడని బాధితురాలు వివరించింది. నిందితుడి ఆటో రిజిస్ట్రేషన్‌ను నెంబర్‌ను గుర్తించామని త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.