Road Accident | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపుతప్పి డివైడర్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుణ జిల్లాలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివపురి జిల్లా రిజోడా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గుణ జిల్లాలోని మావాన్లో ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భదౌరా పట్టణానికి (Bhadaura town) సమీపంలోకి రాగానే రోడ్డుపై పశువులను తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి (Car Hits Divider) బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరిని మెరుగైన వైద్యం కోసం భోపాల్ తరలించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతులను గోవింద రఘువంశీ (28), సోనూ రఘువంశీ (35), వీరు కుశ్వాష్ (24), హితేశ్ బైరాగి (24)గా గుర్తించారు. వీరంతా రిజోడాకు చెందిన వారిగా మైనా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి గోపాల్ చౌబే తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Pahalgam Attack | ఉద్రిక్తతలు తగ్గించుకోండి.. భారత్, పాక్కు అమెరికా సూచన
India Pakistan | హెచ్చరించినా మారని పాక్ తీరు.. సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపు చర్యలు