అమరావతి : ఏపీలో దారుణం జరిగింది. ఓ మహిళా కానిస్టేబుల్(suicide) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ మహిళా కానిస్టేబుల్ (Woman constable) గా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వేదవతి (29) ఎస్పీ కార్యాలయంలోని సెక్యూరిటీ గార్డ్ రూమ్లో తన వద్ద ఉన్న సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది.
గత కొంతకాలంగా ఎస్పీ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా ఆమె విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ఆత్మహత్య విషయం తెలుసుకున్న జిల్లా పోలీసులు అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం రాయచోటి ఆస్పత్రికి తరలించారు.