జ్యూవెలర్పై దాడి : బంగారు ఆభరణాలు, రూ 4 లక్షల నగదు దోపిడీ

లక్నో : యూపీలోని ఆగ్రాలో జ్యూవెలర్పై దోపిడీ దొంగలు పంజా విసిరారు. నగరంలోని బంగారు నగల వ్యాపారి గురువారం సాయంత్రం షాపు మూసివేసి ఇంటికి బయలుదేరగా జలేసర్ సబ్ డివిజనల్ కార్యాలయం వద్ద బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనను అడ్డగించారు. వ్యాపారిపై దాడికి తెగబడిన దోపిడీ ముఠా ఆయన వద్ద నుంచి బంగారు ఆభరణాలతో పాటు రూ నాలుగు లక్షల నగదును దోచుకుని ఉడాయించారు.
బాధిత వ్యాపారిని సునీల్ కుమార్ (48)గా గుర్తించారు. దోపిడీ ముఠా తనను చుట్టుముట్టి షూట్ చేస్తామని బెదిరించి బ్యాగ్‌ను గుంజుకున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుమార్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. షాపు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ సునీల్ కుమార్ త్యాగి తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

