కొచ్చి: ఎయిర్‌పోర్టులలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్లు, కస్టమ్స్ ప్రివెంటివ్ యూనిట్లు, ఇతర సిబ్బందితో ఎంత పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసినా బంగారం అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట బంగారం స్మగ్లర్లు ( Gold smuggling ) పట్టుబడుతూనే ఉన్నారు. ఇక పట్టుబడకుండా ఎంత బంగారం అక్రమంగా రవాణా అవుతుందో ఎవ్వరికీ తెలియదు.
తాజాగా కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో ఓ వ్యక్తి 302 గ్రాముల బంగారం పేస్టుతో పట్టుబడ్డాడు. బంగారాన్ని పేస్టుగా మార్చి రెండు పొరల ప్యాంట్ల మధ్యలో దాచుకుని వచ్చిన ప్రయాణికుడిని అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని సీజ్ చేశారు.