Accused of murder should be severely punished | హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి
మన్సూరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి పదిరె భానుచందర్ను హత్య చేసిన నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని.. అదేవిధంగా మృతుడి కుటుంబీకులకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేయాలని కోరుతూ శుక్రవారం ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
రెండు నెలల క్రితమే పదిరె భానుచందర్కు రీటాకావ్యతో వివాహం జరిగిందని తెలిపారు. భానుచందర్ హత్యకు గురవ్వడంతో భార్య రీటాకావ్యతో పాటు ఆయన కుటుంబీకుల పరిస్థితి దయనీయంగా మారిందని మేడి పాపయ్య మాదిగ ఎమ్మెల్యేకు వివరించారు.
భానుచందర్ను హత్య చేసిన దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడటంతో పాటు ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీనిచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మృతుడు భానుచందర్ భార్య రీటా కావ్య, కుటుంబసభ్యులు సునీత, శశిధర్, రేణుక, గోపాల్, ఎమ్యార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాష్, నాయకులు ద్యావని నర్సింహా, ఆకారపు రుక్కమ్మ, జీడి నర్సింహా, మంద జయన్న, సంగపాక యేసూఫ్, శశి, నాగరాజు, మహంకాళి అశోక్, ఎస్. సంజన్న, బరిగల రామక్రిష్ణ, మంద నాగన్న తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

