Hyderabad | హైదరాబాద్ : లంగర్ హౌస్ లక్ష్మీ నగర్ బస్తీలో ఓ వీధి కుక్క స్వైరవిహారం చేసింది. తన ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగు సంవత్సరాల సరస్వతి పవార్ అనే చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. పాప అరుపులు విన్న స్థానికులు కుక్కను తరిమికొట్టారు. అనంతరం చిన్నారిని చికిత్స కొరకు గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదంలో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.