ముంబై : ఓ 25 ఏండ్ల యువతి.. తన ప్రియుడి చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు వస్తే తనకు పెద్ద ప్రమాదమని భావించిన ప్రియుడు అబార్షన్ చేయించుకోవాలని ఆమెకు సూచించాడు. ఈ ఘటన మహారాష్ట్ర నాగపూర్‌లోని యశోధర నగర్ ఏరియాలో వెలుగు చూసింది.
యశోధర నగర్ ఏరియాకు చెందిన సోహెబ్ ఖాన్(30) ఓ యువతిని 2016 నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రియురాలు గర్భం దాల్చిన విషయం తెలియడంతో ఖాన్ ఆందోళనకు గురయ్యాడు. అబార్షన్ ఎలా చేస్తారో, లేదా గర్భస్రావం కోసం ఏ మందులు వాడాలో యూట్యూబ్‌లో వీడియోలు చూసి తెలుసుకోవాలని సోహెబ్ ఆమెకు సూచించాడు. అతను చెప్పిన మాదిరిగానే యూట్యూబ్ వీడియోలు చూసి అబార్షన్‌కు యత్నించింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణమైన సోహెబ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.