చేతబడి ఆరోపణలపై వ్యక్తితో మూత్రం తాగించి కర్రలతో దాడి!

భువనేశ్వర్ : తాంత్రిక విద్యలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి అతడితో బలవంతంగా మూత్రం తాగించిన ఘటన ఒడిషాలోని బొలన్గిర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఉదంతం బయటపడింది. గ్రామంలో ఇటీవల పలువురు అస్వస్థతకు గురికావడంతో మంత్రవిద్యలు నేర్చిన హదిబంధు బగార్తి అనే వ్యక్తే దీనికి కారణమని ఆరోపిస్తూ శనివారం కొందరు గ్రామస్తులు అతడిని ఇంటి నుంచి ఈడ్చుకువచ్చి తీవ్రంగా కొట్టారు.
అతడితో బలవంతంగా మూత్రం తాగించి కర్రలతో దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు ఆపై అతడిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసి కొందరు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నామని బొలన్గిర్ పోలీసులు తెలిపారు. కాగా మంత్రవిద్యలు ప్రదర్శిస్తోందనే ఆరోపణలపై 63 ఏండ్ల వితంతువును ఆదివారం మయూర్‌భంజ్‌లో కొందరు దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Attack
- Crime news
- Odisha
- Witchcraft
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

