శుక్రవారం 15 జనవరి 2021
Crime - Nov 23, 2020 , 16:48:11

ఎన్‌కౌంట‌ర్‌లో నేర‌స్థుడు హ‌తం

ఎన్‌కౌంట‌ర్‌లో నేర‌స్థుడు హ‌తం

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం మంద్సార్ జిల్లా సీతామావ్ ఏరియాలో ఓ నేర‌స్థుడిని స్థానిక పోలీసులు సినీ ఫ‌క్కీలో మ‌ట్టుబెట్టారు. సీతామావ్ ఏరియాలో నేర‌గాళ్లు త‌చ్చాడుతున్నార‌న్న స‌మాచారం మేర‌కు స్థానిక పోలీసులు అక్క‌డి చేరుకున్నారు. నేర‌స్థుల‌ను గుర్తించిన పోలీసులు లొంగిపోవాల‌ని హెచ్చరించారు. కానీ నేర‌స్థులు పోలీసుల హెచ్చ‌రిక‌లను లెక్క‌చేయ‌కుండా కాల్పులు జ‌రిపారు. దీంతో పోలీసులు ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం ఎదురు కాల్పులు జ‌రుప‌గా ఒక నేర‌స్థుడు హ‌త‌మ‌య్యాడు. అయితే, అత‌ని గ్యాంగ్‌లోని మిగ‌తా స‌భ్యులు పోలీసుల‌కు చిక్క‌కుండా పారిపోయారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.