హైదరాబాద్ : కూకట్పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం నాలుగో అంతస్తు స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరో ఇద్దరు కూలీలు ఉన్నట్లు సమాచారం.
స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే స్లాబ్ వేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.