సోదరిపై తండ్రి లైంగిక దాడి : మనస్ధాపంతో బాలుడి బలవన్మరణం

జోధ్‌పూర్ : కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతురిపై కన్న తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం రాజస్ధాన్‌లో కలకలం రేపగా ఈ విషయం తెలుసుకున్న సోదరుడు మనస్ధాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. జలోర్ సమీపంలోని సంచోర్ ప్రాంతంలో ఈ దారుణం వెలుగుచూసింది. తాను నిద్రించే సమయంలో తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మైనర్ బాలిక తన ఆంటీతో చెబుతున్న ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది.
మొబైల్ ఫోన్ కొనిస్తానని తనను బయటకు తీసుకువెళ్లిన తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక ఈ ఆడియో క్లిప్‌లో చెప్పడం వినిపించింది. సోదరుడిని కూడా తమతో తీసుకువెళ్లాలని తమ తల్లి చెప్పినా తండ్రి వినిపించుకోలేదని బాధితురాలు వివరించింది.
ఈ ఆడియో క్లిప్ తన దృష్టికి రావడంతో ఆమె సోదరుడు మనస్ధాపం చెంది కాలవలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆడియో క్లిప్ బయటకు వచ్చిన తర్వాత దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితురాలి ఇంటికి రాగా బాలుడి బలవన్మరణం విషయం తెలిసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టామని బాధిత బాలిక స్టేట్మెంట్ రికార్డు చేశామని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

