Bangalore | బెంగళూరులో దారుణం జరిగింది. ఓ యువకుడిని ఏడుగురు పట్టుకుని కొట్టి చంపారు. నగరంలోని కేపీ అగ్రహారం ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ కావడంతో శుక్రవారం జరిగిన దారుణహత్య వెలుగులోకి వచ్చింది. కాగా, ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఓ ముప్పై ఏండ్ల వయసున్న యువకుడిని ఏడుగురు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. రాళ్లు, ఇటుకలతో యువకుడిపై దాడికి పాల్పడినట్లుగా తెలుస్తున్నది. నిందితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రాళ్లు, ఇటుకలతో కొడుతుండగా బాధితుడు అరిచిన అరుపులకు సమీప ప్రాంత ప్రజలు రావడంతో నిందితులు పారిపోయారు.
ఈ విషయాన్ని స్థానికులు పోలీసులు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితుడిని దవాఖానకు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఓ దుండగుడు రాయితో తలను గుర్తుపట్టరాకుండా ఉండేలా బాదినది వీడియోలో కనిపిస్తున్నది. మృతుడు బాదామి నివాసిగా పోలీసులు గుర్తించినట్లు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. యువకుడ్ని ఎందుకు కొట్టి చంపారనేది తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.