బదౌన్: ఉత్తప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. బదౌన్ జిల్లా ఉజ్హని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరేండ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాధితురాలి బంధువే ఈ దుర్మార్గానికి ఒడిగట్టడం దారుణం. వివరాల్లోకి వెళ్తే.. బాధిత బాలిక గురువారం సాయంత్రం తన ఇంటిముందు ఆడుకుంటుండగా ఓ 22 ఏండ్ల యువకుడు ఆమెను సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి పారిపోయాడు.
ఇంతలో బాలిక కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. నిందితుడు బాలికను తీసుకెళ్తుండగా చూసిన కొందరు వారు అటవీ ప్రాంతంవైపు వెళ్లినట్లు తెలిపారు. గ్రామస్తులతో కలిసి కుటుంబసభ్యులు అటు వెళ్లి గాలించగా బాలిక ఏడుస్తూ కనిపించింది. నిందితుడు పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేర్చారు. పరారీలో ఉన్న నిందితుడిని ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు.