మంగళవారం 26 జనవరి 2021
Crime - Oct 22, 2020 , 13:02:48

హైద‌రాబాద్‌లో ఐదు నెల‌ల గ‌ర్భిణి ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్‌లో ఐదు నెల‌ల గ‌ర్భిణి ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని జ‌గ‌ద్గిరిగుట్ట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని పాపిరెడ్డి న‌గ‌ర్‌లో విషాదం నెల‌కొంది. ఓ ఐదు నెల‌ల గ‌ర్భిణి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కృష్ణ‌ప్రియ‌, శ్ర‌వ‌ణ్ కుమార్ ఐదు నెల‌ల‌‌ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో కృష్ణ‌ప్రియ‌కు అత్త‌మామ‌ల నుంచి వ‌ర‌క‌ట్న వేధింపులు అధిక‌మ‌య్యాయి. క‌ట్నం తీసుకురావాల‌ని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన కృష్ణ‌ప్రియ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మృతురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు జ‌గ‌ద్గిరిగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేశారు. భ‌ర్త శ్ర‌వ‌ణ్ కుమార్‌తో పాటు అత్త‌మామ‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


logo