న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఒక డాక్టర్ ఇంట్లో 3,293 నకిలీ బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను పోలీసులు కనుగొని స్వాధీనం చేసుకున్నారు. బ్లాంక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే లిపోసోమల్, యాంఫోటెరిసిన్-బి నకిలీ ఇంజెక్షన్లు తయారు చేసి అమ్ముతున్న ఇద్దరు డాక్టర్లతోపాటు మరో ఐదుగురిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాముద్దీన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న డాక్టర్ అల్తామాస్ హుస్సేన్ ఇంట్లో తనిఖీలు చేసి 3,293 నకిలీ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.