శనివారం 16 జనవరి 2021
Crime - Nov 18, 2020 , 17:34:26

వీధి కుక్కల దాడిలో 26 మేకలు, గొర్రెలు మృతి

వీధి కుక్కల దాడిలో 26 మేకలు, గొర్రెలు మృతి

యాదాద్రి భువనగిరి :  వీధి కుక్కల దాడిలో  26 గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డ సంఘటణ బుధవారం భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని జిబ్లక్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్ల చంద్రయ్య తన గొర్రెల మందను గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసుకోని ప్రతి రోజు గ్రామ పొలిమేరలో మేపుకునేవాడు. 

మంగళవారం రాత్రి కూడా తన జీవాలను మందలోకి తోలి ఇంటికి వెళ్లాడు. అయితే బుధవారం ఉదయం చంద్రయ మంద వద్దకు వెళ్లి చూసేసరికి సుమారు 26 గొర్రెలు, మేకలు రక్తపు మడుగులతో పడి చనిపోయి ఉన్నాయి. అయితే వీధి కుక్కల దాడిలోనే తన జీవాలు మృత్యువాతపడ్డాయని చంద్రయ్య వాపోయాడు.