శ్రీనగర్, అక్టోబర్ 3: పాక్‌నుంచి భారత్‌లోకి ఆయుధాలతో పాటు డ్రగ్స్ కూడా స్మగ్లింగ్ అవుతున్నాయి. కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్లో భద్రతా దళాలు రూ.25 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొన్నాయి. దాదాపు 30 కిలోల హెరాయిన్ పట్టుబడిందని బారాముల్లా సీనియర్ ఎస్పీ రాయీస్ అహ్మద్ చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్నదని, డ్రగ్స్ రవాణా మాడ్యూల్‌ను త్వరలోనే ఛేదించే అవకాశం ఉందని చెప్పారు.