న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని శాలిమార్ బాగ్ ఏరియాలో దొంగలు రెచ్చిపోయారు. జనం రద్దీ నడుమనే ఇద్దరు దొంగలు ఓ యువతి ఫోన్ కొట్టేశారు. అయితే, ఆ యువతి దొంగ జాకెట్ దొరకబుచ్చుకుని వదలకపోవడంతో దాదాపు 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత రోడ్డుపై స్కూటీ కుదుపునకు గురికావడంతో బాధిత యువతి రోడ్డుపై జారి పడిపోయింది. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే ఓ యువతి గురువారం సాయంత్రం విధులు ముగించుకుని రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. అయితే, సరిగ్గా సాయంత్రం 5.30 గంటల సమయంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు దొంగలు ఆ యువతిని టార్గెట్ చేశారు. స్కూటీ వెనుక కూర్చున్న దొంగ యువతి చేతిలోంచి ఫోన్ లాక్కున్నాడు. వెంటనే ఆ యువతి దొంగ జాకెట్ను దొరకబుచ్చుకుంది.
ఇంతలో స్కూటీ నడుపుతున్న దొంగ ఒకేసారి దాని వేగం పెంచాడు. అయినా బాధితురాలు.. దొంగ జాకెట్ను విడువలేదు. సుమారు 150 మీటర్ల దూరం వెళ్లిన తర్వాత స్కూటీ కుదుపునకు లోనుకావడంతో బాధితురాలు జారీ కిందపడిపోయింది. దొంగలు తప్పించుకున్నారు. రోడ్డుపై పడిపోయిన యువతిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యపరీక్షలు నిర్వహించి సాయంత్రం డిశ్చార్జి చేశారు.
దొంగల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, దొంగలు యువతి నుంచి ఫోన్ గుంజుకున్న ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయ్యిందని, త్వరలోనే వాళ్లను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు..
#WATCH | A mobile-snatching incident was reported in the Shalimar Bagh area, on December 16, at 1735 hours, where 2 men on a scooty dragged the victim on the road while snatching her phone: Delhi Police
— ANI (@ANI) December 17, 2021
(Source: CCTV Footage) pic.twitter.com/GYZDw6Uj0J