మంగళవారం 26 జనవరి 2021
Crime - Jan 02, 2021 , 18:12:20

న్యూ ఇయర్‌ పార్టీలో పాల్గొన్న యువతి హత్య

న్యూ ఇయర్‌ పార్టీలో పాల్గొన్న యువతి హత్య

ముంబై: న్యూ ఇయర్‌ పార్టీలో పాల్గొన్న ఒక యువతి హత్యకు గురైంది. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. ఖార్ వెస్ట్‌ ప్రాంతంలోని భగవతి హైట్స్ టవర్‌ 16వ అంతస్తులో డిసెంబర్‌ 31న రాత్రివేళ న్యూ ఇయర్‌ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న 19 ఏండ్ల యువతికి చెందిన ఇద్దరు స్నేహితులు ఒక విషయంపై వాదించుకున్నారు. ఆమె వారించేందుకు ప్రయత్నించగా కొట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ యువతి జుట్టు పట్టుకుని ఆమెపై దాడి చేశారు. అక్కడి నుంచి మరో అంతస్తుకు ఆ యువతిని తీసుకెళ్లారు. 

కాగా, ఆమె తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అసలు ఏం జరిగింది అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. న్యూ ఇయర్‌ పార్టీలో పాల్గొన్న వారు మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. నిషేధం ఉన్నప్పటికీ పార్టీ ఏర్పాటు చేయడంపై మరో కేసు నమోదు చేస్తామని చెప్పారు. మరోవైపు పార్టీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి డిమాండ్ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo