పాట్నా : బీహార్లోని పాట్నా జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీపు ప్రమాదవశాత్తు గంగా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు దళాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.
Bihar: A jeep, carrying at least 15 passengers, fell into river Ganga at Peepapul in Patna today; at least 10 people missing. Search operation for the missing peole is underway. pic.twitter.com/wObcjXFYQM
— ANI (@ANI) April 23, 2021