బియ్యం: రెండు కప్పులు, మైదా పిండి: పావు కప్పు, బెల్లం: అర కప్పు,
ఉప్పు: చిటికెడు,
యాలకుల పొడి: అర టీస్పూన్,
వెన్న: అర కప్పు,
పాలు: అర కప్పు,
నూనె: వేయించడానికి సరిపడా.
బియ్యాన్ని బాగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టి నీళ్లు వంపి ఆరబెట్టాలి. పొడి పొడిగా ఆరిన బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసి.. జల్లెడ పట్టుకోవాలి. ఒక గిన్నెలో బియ్యం పిండి, మైదా, ఉప్పు, వెన్న వేసి బాగా కలిపి కొద్దికొద్దిగా పాలుపోస్తూ చపాతీ పిండిలా ముద్ద చేసుకోవాలి. పిండి మిశ్రమాన్ని చిన్నచిన్న గోళీల పరిమాణంలో చేసి ఎండిపోకుండా మూతపెట్టాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి బాగా వేడయ్యాక.. అప్పటికే చేసిపెట్టుకున్న ఉండలను దోరగా వేయించాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ తీగపాకం పట్టుకోవాలి. వేయించిన ఉండలు, యాలకుల పొడి పాకంలో వేసి బాగా కలుపుకొంటే.. చిన్నికృష్ణుడికి ఇష్టమైన వెన్న ఉండలు సిద్ధం.