వాము ఆకులు: పది
పచ్చి మిరపకాయలు: మూడు
పుట్నాల పప్పు: కప్పు
చింతపండు: నిమ్మకాయంత
పోపుగింజలు: స్పూను
కొత్తిమీర: నాలుగు రెమ్మలు
నూనె: ఒక టేబుల్ స్పూను
ఉప్పు: తగినంత
ముందుగా చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాము ఆకులు కడిగి మిక్సీ జార్లో వేయాలి. పుట్నాలు, పచ్చి మిరపకాయలు, ఉప్పుతోపాటు చింతపండు రసం కూడా జోడించి, కొద్దిగా నీళ్లు కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొత్తిమీర సన్నగా తరిగి పచ్చడి మీద చల్లాలి. తర్వాత బాణట్లో నూనె పోసి పోపు గింజలువేసి, చిటపటలాడాక పచ్చట్లో వేస్తే… ఇడ్లీల్లోకి నోరూరించే వామాకు పచ్చడి రెడీ!