కావలసిన పదార్థాలు: రాగిపిండి: ఒక కప్పు, వనస్పతి: పావు కప్పు, నూనె: డీప్ ఫ్రై చేసుకోవడానికి, నువ్వులు: అర కప్పు, కొబ్బరిపొడి: ఒక కప్పు, బెల్లం: ఒక కప్పు.
తయారీ విధానం: ముందుగా నువ్వులను దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి
కరిగించాలి. బెల్లం కరిగాక కొబ్బరిపొడి, డాల్డా వేసి ఉడికించి నువ్వులు, రాగిపిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకుని బూరెల్లా ఒత్తుకుని నూనెలో వేయించుకుంటే సరి. తీపి తీపి రాగి బూరెలు రెడీ.