పెసరపప్పు: ఒక కప్పు
క్యారెట్: ఒకటి
బీన్స్: గుప్పెడు
క్యాబేజీ: చిన్న ముక్క
ఈనో ప్యాకెట్: ఒకటి
బొంబాయి రవ్వ: పావు కప్పు
పెరుగు: ఒక గరిట
ఉప్పు: తగినంత
కొత్తిమీర: అయిదారు రెబ్బలు
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి. క్యారెట్, క్యాబేజీలను కడిగి తురుముకోవాలి. బీన్స్‌ను సన్నటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పును మెత్తగా రుబ్బుకోవాలి. అందులో బొంబాయి రవ్వ కలుపుకోవాలి. ఇందాక సిద్ధం చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలను వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా దీనికి జోడించాలి. కాస్త ఉప్పుతోపాటు ఈనో వేసి బాగా కలియబెట్టాలి. పెరుగు చేర్చడం వల్ల కాస్త పుల్లటి రుచి వస్తుంది. వెంటనే ఇడ్లీ పాత్రలో వేసుకొని ఆవిరి మీద ఉడికించుకుంటే ఆరోగ్యకరమైన పెసరపప్పు ఇడ్లీలు సిద్ధమైపోతాయి.