కావలసిన పదార్థాలు
బ్రకోలీ ముక్కలు: ఒక కప్పు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, క్యాప్సికం, టమాట ముక్కలు: పావు కప్పు చొప్పున, చీజ్ తురుము: ఒక కప్పు, ఉడికించిన స్వీట్‌కార్న్: రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్, గోధుమపిండి, మైదాపిండి: ఒక కప్పు చొప్పున, నూనె: అర కప్పు.
తయారీ విధానం
ఒక గిన్నెలో మైదాపిండి, గోధుమపిండి, ఒక టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి పావుగంట మూతపెట్టి పక్కనపెట్టాలి. బ్రకోలీ ముక్కల్ని పది నిమిషాల పాటు ఉప్పునీళ్లలో ఉడికించి చిన్నగా తరగాలి. ఒక గిన్నెలో బ్రకోలీ, టమాట, క్యాప్సికం, ఉల్లిగడ్డ ముక్కలు, చీజ్ తురుము, స్వీట్ కార్న్, కారం, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చెయ్యాలి. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని చపాతీలా ఒత్తి పెనంపై వేసి ఒక నిమిషంపాటు రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. కాలిన చపాతీ మధ్యలో బ్రకోలీ మిశ్రమం పెట్టి గుండ్రంగా చుట్టి ఒక నిమిషంపాటు మూతపెడితే వేడివేడి మెక్సికన్ పరోటా రోల్స్ సిద్ధం.