కావలసిన పదార్థాలు
కాస్త చిన్న కాకరకాయలు: ఆరు
మామిడికాయ: పుల్లటిది సగం
శనగపిండి: కప్పు
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
ధనియాలు జీలకర్ర పొడి: ఒక స్పూను
కారం: టేబుల్ స్పూను
పసుపు: పావు స్పూను
ఎండుకొబ్బరి తురుము: టేబుల్ స్పూను
ఉప్పు: తగినంత
తయారీ విధానం
ముందుగా కాకరకాయల్ని కడిగి, నిలువుగా గాటు పెట్టాలి. గింజల్ని తీసేసిన తర్వాత ఇడ్లీ కుక్కర్లాంటి దాని సాయంతో కొద్దిగా ఉడికించాలి. సగం మామిడికాయ ముక్కను తురిమి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులోనే శనగపిండి, కొబ్బరి తురుము, ధనియాలు-జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, స్పూను నూనె వేసి బాగా కలుపుకోవాలి. ముద్దలా అయిన ఈ మిశ్రమాన్ని కాకరకాయలో కూరి దారంతో కట్టాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక, నెమ్మదిగా ఈ కాకరకాయల్ని ఒక్కొక్కటిగా మూకుట్లో వేయాలి. కొద్దిగా వేగాక ఇందాక తయారు చేసుకున్న మిశ్రమాన్ని పైన చల్లాలి. ఇప్పుడు కాయలు బాగా వేగిన దాకా ఉంచి స్టవ్ ఆపేస్తే సరి! వేడివేడిగా అన్నంలో తినడానికి మామిడికాయ గుత్తి కాకరకాయ రెడీ!
-ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు