పాలు: అర లీటర్
జీడిపప్పు: అర కప్పు
నిమ్మకాయ: అర ముక్క
ఉల్లిగడ్డలు: రెండు
కొత్తిమీర తరుగు: అర కప్పు
పుదీనా: గుప్పెడు ఆకులు
టమాటాలు: రెండు
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
శనగపిండి: ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర: ఒక టీ స్పూను
అల్లం వెల్లుల్లి ముద్ద: అర టీ స్పూను
ఉప్పు: తగినంత
ముందుగా పాలను కాగబెట్టుకుని అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. దాంతో పాలు విరిగిపోతాయి. అందులోని నీళ్లను పూర్తిగా పిండేసి.. పనీర్‌ను పక్కన పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు, టమాటాలు, పుదీనా, కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి, అందులో నూనె వేసి.. జీడిపప్పును వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో జీలకర్ర వేసి, వేగాక ఉల్లిగడ్డలు కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను కలపాలి. తరిగిన టమాటాలు వేసి, కాస్త మగ్గనివ్వాలి.
అందులో పనీర్ విరుగును కూడా కలపాలి. సరిపడా ఉప్పు వేసి, కాసేపు మూతపెట్టి ఉంచాలి. ఒక కప్పులో శనగపిండి తీసుకుని, అందులో కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. శనగపిండి మిశ్రమాన్ని బాణట్లోని కూరలో చుట్టూ తిప్పుతూ ఒంపుకోవాలి. కాస్త ఉడికాక ఆ మిశ్రమం దగ్గరగా అవుతుంది. అప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసి.. ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆపేస్తే.. ఇన్స్టంట్ కాజూ పనీర్ బుర్జీ సిద్ధమైనట్టే!