e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home వంటలు రాగి- అంజీర్‌ బర్ఫీ

రాగి- అంజీర్‌ బర్ఫీ

రాగి- అంజీర్‌ బర్ఫీ

కావలసిన పదార్థాలు: రాగిపిండి: రెండు కప్పులు, అంజీర్‌: ఒక కప్పు, తరిగిన బాదం: అరకప్పు, నెయ్యి: ఒక కప్పు, తరిగిన వాల్‌నట్స్‌: పావు కప్పు, గసగసాలు: రెండు టీ స్పూన్లు, ఎండిన ఖర్జూరం: అరకప్పు
తయారీ విధానం: ముందుగా ఖర్జూరాలు, అంజీర్‌ నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు, కడాయిలో నెయ్యి వేడయ్యాక రాగిపిండి వేసి సన్నటి మంటపై వేయించాలి. పిండి బాగా వేగిన తర్వాత గసగసాలు, తరిగిన బాదం, వాల్‌నట్స్‌ వేసి బాగా కలిపి దింపేయాలి. ఇంకో కడాయిలో కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక అంజీర్‌ ముద్ద వేసి, గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి. బాగా వేగిన తర్వాత రాగిపిండి మిశ్రమాన్ని కలిపి, మరికాసేపు వేయిస్తే మెత్తటి ముద్దలా తయారవుతుంది. దాన్ని నెయ్యి రాసిన ప్లేట్‌లో పరిచి చల్లారాక ముక్కలు చేసి, కోసుకుంటే సరి. ఆరోగ్యకరమైన రాగి-అంజీర్‌ బర్ఫీ రెడీ.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాగి- అంజీర్‌ బర్ఫీ

ట్రెండింగ్‌

Advertisement