కావలసిన పదార్థాలు:
పచ్చి మామిడి ముక్కలు: ఒక కప్పు, పుదీనా ఆకులు: పావు కప్పు, చక్కెర: 1/4 కప్పు, ఐసు ముక్కలు: అరకప్పు
తయారీ విధానం:
పచ్చి మామిడికాయ చెక్కు తీసి, చిన్నచిన్న ముక్కలు చేసుకుని, కుక్కర్లో రెండు కప్పుల నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత పుదీనా ఆకులు, చక్కెర వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక గ్లాసులో ఐస్ ముక్కలు వేసి దానిపైన ఈ పన్నా పోసి పైన చిన్న పుదీనా కొమ్మతో అలంకరించి చల్లగా సర్వ్ చేస్తే సరి.