బ్రెడ్ ైస్లెసెస్: నాలుగు, గుడ్లు: రెండు, పాలు: అర కప్పు, ఫ్రెష్ క్రీమ్: ఒక టేబుల్ స్పూన్, దాల్చినచెక్క పొడి: పావు టీస్పూన్, కరక్కాయ పొడి: చిటికెడు, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్: నాలుగు చుక్కలు, ఉప్పు: చిటికెడు, వెన్న: ఒక టేబుల్ స్పూన్, తేనె: రెండు టేబుల్ స్పూన్లు.
ఒక గిన్నెలో గుడ్లు, పాలు, ఫ్రెష్‌క్రీమ్, దాల్చిన చెక్క, కరక్కాయ పొడి, చక్కెర, ఉప్పు, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద పెనం పెట్టి వేడి చెయ్యాలి. బ్రెడ్ ముక్కలను గుడ్ల మిశ్రమంలో ముంచి పెనంపై మెల్లగా తిప్పుతూ రెండు వైపులా వెన్నవేసి కాల్చుకోవాలి. పైనుంచి తేనె వడ్డించుకుంటే నోరూరించే ఫ్రెంచ్ టోస్ట్ సిద్ధం.