పైనాపిల్ ముక్కలు: ఒక కప్పు, మైదా: ఒక కప్పు, నూనె: అరకప్పు, గుడ్లు: రెండు, చక్కెర: అరకప్పు, బేకింగ్ పౌడర్: ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా: అర టీస్పూన్, పైనాపిల్ ఎసెన్స్: నాలుగు చుక్కలు, ఉప్పు: చిటికెడు
పైనాపిల్ ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నూనె, చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర పూర్తిగా కరిగాక గుడ్లు, మైదా, పైనాపిల్ గుజ్జు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, పైనాపిల్ ఎసెన్స్.. ఒక్కొక్కటీ వేస్తూ బాగా కలపాలి. మిశ్రమాన్ని నూనె రాసిన కేక్ మౌల్డ్‌లో వేసి కుక్కర్‌లోగానీ, ఓవెన్లో గానీ 40 నిమిషాలపాటు ఉడికించుకుంటే ఘుమఘుమలాడే పైనాపిల్ కేక్ సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ravva cake recipe | రవ్వ కేక్ తయారీ విధానం
Bread cake recipe | బ్రెడ్ కేక్ తయారీ విధానం
Popcorn | పాప్‌కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
paneer samosa recipe | పనీర్ సమోసా తయారీ విధానం