బనానా కేక్ తయారీకి కావలసిన పదార్థాలు
అరటి పండ్లు: రెండు, మైదా: ఒకకప్పు, చక్కెర: అరకప్పు, బేకింగ్ పౌడర్: ఒక టీస్పూన్, బేకింగ్ సోడా: పావు టీస్పూన్, నూనె: అరకప్పు, వెనిలా ఎసెన్స్: నాలుగు చుక్కలు,
పాలు: అరకప్పు
బనానా కేక్ తయారీ విధానం
అరటి పండ్లను తొక్కతీసి ముక్కలు చేసుకోవాలి. మిక్సీజార్లో అరటి పండు ముక్కలు, చక్కెర, పాలు, నూనె, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అరటి పండు మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి మైదా వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నూనెరాసిన గిన్నెలో వేసి కుక్కర్లో పెట్టి నలభై నిమిషాలపాటు సన్నటి మంటపై ఉడికించుకుంటే బనానా కేక్ సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
pineapple cake recipe | పైనాపిల్ కేక్ తయారీ విధానం
Ravva cake recipe | రవ్వ కేక్ తయారీ విధానం
Bread cake recipe | బ్రెడ్ కేక్ తయారీ విధానం
Popcorn | పాప్కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
paneer samosa recipe | పనీర్ సమోసా తయారీ విధానం