కొత్తిమీర: రెండు కట్టలు
ఎండుద్రాక్షలు: అరకప్పు
పచ్చిమీర్చి: రెండు లేదా మూడు
ఉప్పు: తగినంత
పుట్నాల పప్పు: ఒక టేబుల్ స్పూన్
నిమ్మకాయ:ఒకటి
ముందుగా అరకప్పు ఎండుద్రాక్షలు తీసుకొని వాటిని అరగంటసేపు నీటిలో నానబెట్టుకోవాలి. మరోవైపు రెండు కొత్తిమీర కట్టలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి కాడలతో సహా వాటిని కట్ చేసుకోవాలి. ఆ తరువాత నానబెట్టిన ఎండుద్రాక్షలు, తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తరువాత చిక్కదనం కోసం ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును వేసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని మిక్సిలో వేసి మెత్తగా చేసుకుంటే నోరూరుంచే ద్రాక్ష కొత్తిమీర పచ్చడి సిద్ధమైనట్టే!