కావలసిన పదార్థాలు: శనగపిండి: కప్పు
బియ్యప్పిండి: అరకప్పు
వాము: పావు స్పూను
కారం: ఒక స్పూను
ఉప్పు: తగినంత
సోడాఉప్పు: చిటికెడు
చిలగడ దుంపలు: పెద్దవి రెండు
నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం : ముందుగా చిలగడ దుంపలను శుభ్రంగా కడిగి పల్చగా పొడవాటి ముక్కలుగా తరిగి నీళ్లలో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. అందులో ఉప్పు, వాము, సోడా, కారం వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. అంటే బజ్జీ వేసేందుకు వీలుగా జారుడుగా పిండి వచ్చేలా ఈ నీళ్లను పోసుకోవాలి. తర్వాత పిండిలో అన్నీ కలిసేలా బాగా కలియబెట్టాలి. ఎంత కలిపితే బజ్జీలు అంత గుల్లగా వస్తాయి. ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. నూనె బాగా కాగాక, ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో చిలగడదుంప ముక్కలను ముంచి అందులో వేయాలి. మంట తక్కువగా పెట్టి కాలిస్తే లోపలి చిలగడదుంప కూడా చక్కగా ఉడుకుతుంది.