Harish Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు లండన్‌లోని ‘అంబేద్కర్ హౌస్’ (Ambedkar House)ను సందర్శించారు. కింగ్ హెన్రీ రోడ్డులోని ఈ హౌస్‌లో గురువారం ఆయన అంబేద్కర్ గురించిన వ్యాసాలు, కథనాలను ఆసక్తిగా చదివారు. సామాజికతత్వవేత్త అయిన అంబేద్కర్ విద్యార్థిగా ఉన్నప్పుడు చదువుకున్న ప్రదేశాన్ని చూసి తరించిన హరీశ్‌రావు.. ఆ మహానేతకు నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి సందర్శకుల పుస్తకంలో ఎమ్మెల్యే సంతకం చేశారు. తాను అంబేద్కర్ హౌస్ దర్శనానికి సంబంధించిన ఫొటోలను మాజీ మంత్రి ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
‘ఈరోజు లండన్‌లో ఒకప్పుడు అంబేద్కర్ విద్యార్థిగా గడిపిన అంబేద్కర్ హౌస్‌ను సందర్శించాను. చరిత్రాత్మకమైన ఈ ప్రదేశానికి హృదయపూర్వకంగా వందనాలు. దార్శనికుడైన అంబేద్కర్ కోరుకున్న సమానత్వం, న్యాయం, సాధికారితకు చిహ్నంగా ఉందీ గది. సమ్మిళిత భారత్ నిర్మాణం దిశగా ఆ మహనీయుడు పాటించిన ఆదర్శాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి’ అని హరీశ్ రావు తన పోస్ట్‌లో వెల్లడించారు.
Visited Ambedkar House in London, where Babasaheb once lived during his student days.
Paid my heartfelt respects at this historic place that still resonates with his vision of equality, justice, and empowerment.
His ideals continue to guide us in building an inclusive India and… pic.twitter.com/EuXn1sauqC
— Harish Rao Thanneeru (@BRSHarish) September 4, 2025