Vinayaka Chavithi | బొజ్జ గణపయ్య భోజన ప్రియుడు. నైవేద్యాలు పెట్టి, నవరాత్రులు పూజిస్తే.. విఘ్నాలు తొలగిస్తాడు. విజయాలు చేకూరుస్తాడు. మరి, ఆ గజాననుడి కృపావీక్షణలు మీపై కురవాలంటే.. ఆయనకిష్టమైన పదార్థాలు నివేదించండి. ఆ ప్రసన్న వదనుణ్ని సుప్రసన్నం చేసుకోండి!
ఒక గిన్నెలో నీళ్లు, నూనె పోసి మరిగించాలి. దీంట్లో బియ్యప్పిండిని మెల్లగా పోస్తూ.. ఉండలు లేకుండా కలపాలి. చేతులకు కొద్దిగా నూనె రాసుకొని.. బియ్యపు పిండిని చిన్న ఉండలు (ఉండ్రాళ్లు)గా చేసి పెట్టుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో కొన్ని నీళ్లు పోసి.. ఆవిరి మీద ఈ ఉండ్రాళ్లను ఉడికించాలి. ఈలోపు గిన్నెలో పాలు మరిగించాలి. దీంట్లోనే సాబుదానా, చక్కెర, యాలకుల పొడి వేసి సన్నని మంటమీద పది నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా బియ్యం పిండి వేసి.. పాల మిశ్రమం చిక్కగా అయ్యేలా చూడాలి. ఇందులో ఉడికిన ఉండ్రాళ్లను వేసి.. సన్నని మంటమీద నాలుగు నిమిషాలు ఉంచి దించేయాలి.
బియ్యప్పిండి: ఒక కప్పు
నెయ్యి: 3 టీస్పూన్లు
బెల్లం తురుము: ఒక కప్పు
కొబ్బరి తురుము: 2 కప్పులు
యాలకులు: మూడు
ఉప్పు: చిటికెడు
కడాయిలో నెయ్యి వేడిచేసి బెల్లం, కొబ్బరి తురుము వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. దీనికి యాలకులు జోడించి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. ఇందులోనే ఉప్పు, నెయ్యి వేసి కాసేపు ఉంచి దించేయాలి. ఈ నీళ్లు చల్లారక ముందే.. అందులో బియ్యప్పిండి కలుపుకొని.. పూరి పిండిలా మెత్తగా చేసుకోవాలి. వీటిని చిన్న ఉండలుగా చేసి, మధ్యలో చిన్న దొప్పలా చేసుకోవాలి. దీంట్లో బెల్లం మిశ్రమాన్ని ఉంచి.. మోదక్ ఆకారంలో ముడవాలి. అన్నిటినీ సిద్ధం చేసుకున్నాక, ఇడ్లీ కుక్కర్లో ఓ పది నిమిషాలపాటు ఆవిరి మీద ఉడికించుకుంటే.. మోదక్‌లు సిద్ధం.