Janhvi Kapoor | బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం పరమ్ సుందరి. ఈ సినిమా భాషా వివాదంపై మలయాళ గాయని పవిత్రా మీనన్ స్పందించారు. చిత్రంలో కేరళ యువతిగా జాన్వీని ఎంపిక చేయడాన్ని ఆమె ప్రశ్నించినట్లు కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, తాను జాన్వీ నటనను విమర్శించలేదని పవిత్ర స్పష్టం చేశారు. ‘నేను నటిని కాదు, గాయనిని. నా వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారు. జాన్వీకి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడలేదు. నా అభిప్రాయం భాష పరిమితిలోనే ఉంది’ ఆమెను స్పష్టం చేశారు. తాను వ్యక్తిగతంగా జాన్వీని కలిశానని.. ఆమె పాత్రను బాగా చేశారు తెలిపారు.
‘నటీనటులు వేరే ప్రాంతాలకు చెందితే.. వారు ఆ భాషను సరిగా పలకగలిగేలా ట్రైనింగ్ ఇవ్వాలన్నదే నా సూచన’ అని పేర్కొన్నారు. అవకాశాలను లాక్కోవాలని చూడలేదని.. తన ఉద్దేశం పూర్తిగా భిన్నమైందని తెలిపారు. ఇప్పటికే ఈ వివాదంపై జాన్వీ కపూర్ స్పందించింది. తాను మలయాళీ కాకపోయినా, మలయాళ సినిమాలు, సంస్కృతి పట్ల గౌరవం ఉందన్నారు. ‘పరమ్ సుందరి’లో నేను కేవలం మలయాళ యువతిగా కాకుండా.. తమిళ యువతిగా కూడా కనిపిస్తానని జాన్వీ పేర్కొంది. ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించగా.. ‘తుషార్ జలోటా’ దర్శకత్వం వహించారు. కేరళ అమ్మాయి సుందరి దామోదరం పిళ్లై (జాన్వీ), ఢిల్లీ యువకుడు పరమ్ సచ్దేవ్ (సిద్ధార్థ్) మధ్య సాగిన ప్రేమకథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ఆగస్టు 29న విడుదలైంది.